బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది సోనియా ఆకుల. ఇక ఇప్పుడు తన లవర్ యష్ ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. యష్ తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సోనియా. ఈ పెళ్ళికి మొత్తం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ వెళ్లారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత వచ్చారు. డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని మూవీస్ లో సోనియా నటించింది.
ఆ పాపులారిటీతో సోనియా బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకుంది. తర్వాత నిఖిల్, పృథ్వీతో ఫ్రెండ్ షిప్ కారణంగా ఆమె మీద చాలా నెగటివిటీ వచ్చేసింది. ఫైనల్ గా ఫోర్త్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. హౌస్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది సోనియా. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో ఇంటర్వ్యూలలో మాట్లాడింది. ఇక తన ఫ్రెండ్స్ నిఖిల్, పృథ్వీతో తనకున్న బాండింగ్ పై సైతం క్లారిటీ ఇచ్చింది.